99శాతం సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడు కొరటాల శివ. రచయితగా కెరీర్ మొదలుపెట్టి, దర్శకుడిగా మారి, వరుస విజయాలను అందుకొని టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరిగా నిలిచారు కొరటాల. బ్లాక్బాస్టర్ ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్‌తో ఆయన చేసిన సినిమా ‘దేవర’. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్,, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె రెండు భాగాలుగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలిభాగం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో కొరటాల శివ విలేకరులతో ముచ్చటించారు.