‘ప్రేక్షకులకు ఆద్యంతం వినోదాన్ని పంచే సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. జనవరి 13న సంక్రాంతికి మీ ముందుకు రాబోతున్నాం. వందశాతం ఈ సినిమాతో మిమ్మల్ని ఆకట్టుకుంటాం. కేవలం రవితేజ కోసమే ఈ కథ రాశాను. మన జీవితాన్ని తెరపై చూసుకున్నట్టుంటుందీ సినిమా. ఇందులో రవితేజ చాలా ఫ్రెష్‌గా కనిపిస్తారు. ఆయన మార్క్ ఫన్‌కి కొదవ ఉండదు.
ఇందులో రామసత్యనారాయణగా రవితేజ పండించే వినోదానికి ప్రేక్షకులు నవ్వుల పర్యంతం అవుతారు.’ అని దర్శకుడు కిశోర్ తిరుమల అన్నారు. ఆయన దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.
అషికా రంగనాథ్, డింపుల్ హయాతి కథానాయికలు. చెరుకూరి సుధాకర్ నిర్మాత. జనవరి 13న సినిమా విడుదల కానున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో కిశోర్ తిరుమల మాట్లాడారు.
టైటిల్ లాగానే సినిమా కూడా ఆసక్తికరంగా ఉంటుందని, ఇందులో బాలామణిగా ఓ కొత్త డింపుల్‌ని చూస్తారని కథానాయిక డింపుల్ హయాతి తెలిపారు. ఆధునిక అనుబంధాల గురించి సున్నితమైన వినోదంతో చెప్పిన సినిమా ఇదని, ఇందులో మానసశెట్టిగా ఆత్మైస్థెర్యంతో కూడుకున్న ఆధునిక మహిళగా కనిపిస్తానని, రవితేజతో నటించడం గొప్ప అనుభవమని కథానాయిక అషికా రంగనాథ్ ఆనందం వెలిబుచ్చారు.