‘మహాభారతం చదివినప్పుడు అందులో శాపాల నేపథ్యంలో కథల గురించి తెలుసుకున్నా. అలాంటి ఓ శాపాన్ని ఈ తరం యువకుడు ఎదుర్కొంటే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచే ‘హ్యాపీ ఎండింగ్’ సినిమా కథ పుట్టింది’ అన్నారు కౌశిక్ భీమిడి. ఆయన దర్శకత్వంలో యష్ పూరి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది.
ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు కౌశిక్ భీమిడి మాట్లాడుతూ ‘దర్శకుడిగా నాకిది తొలి చిత్రం. టాలెంటెడ్ టీమ్‌తో సినిమా చేశాను. పురాణాల నేపథ్యం నుంచి తీసుకున్న కాన్సెప్ట్ కాబట్టి మేకింగ్ మాత్రం నేటి ట్రెండ్‌కు తగినట్లుగా ఉండాలనుకున్నా. అప్పుడే నేటి యూత్‌కు సినిమా రీచ్ అవుతుందనిపించింది.
ఇదొక రొమాంటిక్ డ్రామా. హీరోకు శాపం వల్ల అతని జీవితం ట్రాజెడీగా అనిపిస్తుంది కానీ చూసే ఆడియెన్స్‌కు మాత్రం నవ్వు తెప్పిస్తుంది. శాపానికి గురైన యువకుడు ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే అంశం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమాలో రొమాన్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎక్కడా అసభ్యత లేకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ చూసే విధంగా తెరకెక్కించాం. ైక్లెమాక్స్‌లో హీరో శాపవిముక్తుడు కావడంతో కథ సుఖాంతమవుతుంది’ అన్నారు.