కడుపుబ్బా నవ్వించే వినోదానికి చిరునామా దర్శకుడు కె.వి.అనుదీప్. ఇక తనదైన ైస్టెల్‌తో యువతలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు హీరో విశ్వక్సేన్. వీరిద్దరి కలయికలో వస్తున్న ఫీల్‌గుడ్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఫంకీ’. కయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్నది. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టారు. ఇటీవల చిత్రంలోని తొలి గీతం ‘ధీరే ధీరే’ విడుదలైంది.
భీమ్స్ సిసిరోలియో స్వరపరచిన ఈ పాటకు దర్శకుడు కె.వి.అనుదీప్ సాహిత్యాన్నందించారు. మెలోడీ ప్రధానంగా ఈ పాట సాగింది. హీరో విశ్వక్సేన్ ఈ చిత్రంలో సినీ దర్శకుడి పాత్రలో కనిపించనున్నారు. స్వచ్ఛమైన వినోదం, కాస్త గందరగోళం, కడుపుబ్బా నవ్వించే కామెడీ కలబోతగా ఈ సినిమా ఆకట్టుకుంటుందని, దర్శకుడు కె.వి.అనుదీప్ ఈసారి రెట్టింపు నవ్వుల్ని పంచుతారని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, రచన-దర్శకత్వం: అనుదీప్ కేవీ