Thalapathy 69 | గతేడాది గోట్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (GOAT) సినిమాతో హిట్ అందుకున్న తమిళ అగ్ర నటుడు దళపతి విజయ్ ప్రస్తుతం హెచ్. వినోద్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దళపతి 69 (Thalapathy 69) అంటూ వస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో పూజ హెగ్దే కథానాయికగా నటిస్తుండగా.. ప్రేమలు బ్యూటీ మమితా బైజు కీలక పాత్రలో నటించబోతుంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి గత కొన్ని రోజులుగా ఒక వార్త వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలకృష్ణ భగవంత్ కేసరి (Bhagavanth Kesari) సినిమాను దళపతి 69(Thalapathy Vijay 69)గా రీమేక్ చేస్తున్నట్లు.. ఇప్పటికే దీనికి సంబంధించిన తమిళం హక్కులను కూడా మేకర్స్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలపై దర్శకుడు హెచ్.వినోద్ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా భగవంత్ కేసరి రీమేక్ కాదని.. ఇది ఒక ఒరిజినల్ కథ అని.. విజయ్‌కి ఈ చిత్రం పక్కా మాస్ కమర్షియల్ కమర్షియల్ ఎంటర్టైనర్ అవుతుందని తెలిపాడు.
ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించనుండగా.. కన్నడ టాప్ బ్యానర్ కేవీఎన్ ప్రోడక్షన్ ఈ మూవీని నిర్మించనుంది. ఈ సినిమాను అక్టోబర్ 2025న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
Also Read..