త్రివిక్రమ్ మాటలే స్ఫూర్తి!
‘సక్సెస్ కోసం మనందరం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. దేవతలు ప్రత్యక్షమై మన కోరికలు తీరిస్తే బాగుంటుంది కదా అనే ఫాంటసీ ప్రతీ ఒక్కరికి ఏదో సందర్భంలో వచ్చే ఉంటుంది. అలాంటి ఆలోచన నుంచే ఈ కథ పుట్టింది’ అన్నారు దర్శకుడు చంద్రమోహన్ చింతాడ.
‘సక్సెస్ కోసం మనందరం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. దేవతలు ప్రత్యక్షమై మన కోరికలు తీరిస్తే బాగుంటుంది కదా అనే ఫాంటసీ ప్రతీ ఒక్కరికి ఏదో సందర్భంలో వచ్చే ఉంటుంది. అలాంటి ఆలోచన నుంచే ఈ కథ పుట్టింది’ అన్నారు దర్శకుడు చంద్రమోహన్ చింతాడ. ఆయన నిర్ధేశకత్వంలో అల్లరి నరేష్ హీరోగా రూపొందించిన కామెడీ ఎంటర్టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం దర్శకుడు చంద్రమోహన్ చింతాడ విలేకరులతో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ ‘సొంత ఊర్లోనే ఉండి హీరో అవ్వాలనే కలలు కనే వ్యక్తి కథ ఇది. ఏదో మ్యాజిక్ జరిగి తన కోరిక నెరవేరాలనుకుంటాడు.
అలాంటి సమయంలో ఇంట్లో ఉన్న ఓ పుస్తకం గురించి తెలుసుకుంటాడు. దానిపై ఉన్న ప్యాటర్న్స్ సరిగ్గా ఓపెన్ చేస్తే రంభ, ఊర్వశి, మేనక ప్రత్యక్షమవుతారు. ఈ నేపథ్యంలో వారు ఈ భువిపైకి వస్తే ఏం జరిగిందన్నదే ఈ సినిమా కథ’ అని తెలిపారు. ఈ సినిమాలో ఆరోగ్యకరమైన హాస్యం ఉంటుందని, ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చని పేర్కొన్నారు. ‘సంభాషణల విషయంలో త్రివిక్రమ్గారు నాకు స్ఫూర్తి. ఒక మంచి మాటతో నవ్వులు పండిస్తే అది కలకాలం గుర్తుండిపోతుందని ఆయన ఓ సందర్భంలో చెప్పారు. ఈ విషయాన్ని నేను బలంగా నమ్ముతాను’ అని చంద్రమోహన్ చింతాడ పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

