Ram Charan | అగ్ర హీరో రామ్‌చరణ్ కథానాయకుడిగా ‘ఉప్పెన’ఫేం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కర్నాటకలో కొంతభాగం జరిగింది. త్వరలో ఢిల్లీ షెడ్యూల్ మొదలు కానుంది. అక్కడ కుస్తీ పోటీలకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తారని తెలుస్తున్నది. అసలు కుస్తీ పోటీలకూ ఢిల్లీ నగరానికి, ఈ కథకూ సంబంధం ఏంటి? అనేది ఆసక్తికరమైన విషయమట.
ఈ సినిమాలో కథ రీత్యా రెండు క్రీడల నేపథ్యాలుంటాయని ఇప్పటికే లీకైంది. క్రికెట్ నేపథ్యంలో సాగే కొన్ని సన్నివేశాలను ఇప్పటికే రామ్‌చరణ్, ‘మీర్జాపూర్’ఫేం దివ్యాంశులపై చిత్రీకరించారు. రేపు ఢిల్లీలో తీసే కుస్తీ పోటీల్లో రామ్‌చరణ్‌తో తలపడే వ్యక్తి ఎవరు? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సన్నివేశాలను రామ్‌చరణ్, శివరాజ్కుమార్లపై చిత్రీకరిస్తారట. అయితే.. ప్రస్తుతం శివరాజ్‌కుమార్ విశ్రాంతిలో ఉన్నారు.
ఈ లోపు ఆయన లేని సీన్స్ తీస్తారట. ఈ షెడ్యూల్ చివర్లో శివరాజ్‌కుమార్ ఎంటర్ అవుతారని తెలుస్తున్నది. ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు వార్తలొచ్చాయి. మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పానిండియా సినిమాలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.