కమర్షియల్ చిత్రాల్ని తనదైన పంథాలో తెరకెక్కిస్తూ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు బాబీ కొల్లి. ఇటీవల ‘డాకు మహారాజ్’తో భారీ విజయాన్ని సాధించారు. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. తాజా సమాచారం ప్రకారం చిరంజీవి కథానాయకుడిగా బాబీ కొల్లి ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని తెలిసింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది.
చిరంజీవి కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతుండటం విశేషం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుందని తెలిసింది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని అంటున్నారు. చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’లో నటిస్తున్నారు. మేలో ప్రేక్షకుల ముందుకురానుంది. దీని తర్వాత ఆయన అనిల్ రావిపూడి డైరెక్షన్స్లో సినిమా చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాకే బాబీ కొల్లి డైరెక్ట్ చేసే సినిమా పట్టాలెక్కే అవకాశముందని సమాచారం.