Balakrishna | బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాలోని బాలయ్య పెర్ఫార్మెన్స్ గురించి దర్శకుడు కె.ఎస్.రవీంద్ర(బాబీ) ఆసక్తికరంగా మాట్లాడారు. ‘నాకెరీర్‌లో ఇప్పటివరకూ అలాంటి నటుడ్ని చూడలేదు. ‘డూప్’ అనే పేరెత్తితే ఆయనకు పూనకం వస్తుంది. 60ప్లస్ ఏజ్‌లో కూడా డూప్ లేకుండా నటించడానికే బాలయ్య ఇష్టపడతారు. ఆయన డెడికేషన్‌కి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే.’ అన్నారు. ఇంకా చెబుతూ ‘ఇందులో కథానుగుణంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి.
ఆ సన్నివేశాల్లో బాలయ్య నటన అద్భుతం. నిజంగా ఇలాంటి యాక్టర్ చాలా అరుదుగా ఉంటారు. దర్శకుడిగా నాకు పూర్తి సంతృప్తినిచ్చిన సినిమా ‘డాకు మహారాజ్” అని తెలిపారు డైరెక్టర్ కేఎస్ రవీంద్ర. బాలయ్య బ్లాక్‌బస్టర్స్ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, అఖండ సినిమాలను మించి ఈ సినిమా ఉంటుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఇటీవల మీడియా ముఖంగా చెప్పిన విషయం తెలిసిందే. మొత్తంగా దర్శక, నిర్మాతలు ఈ సినిమాపై వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.