అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్లో భారీ పాన్ వరల్డ్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘పుష్ప-2’ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రమిదే కావడంతో ప్రకటన రోజు నుంచే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా హైప్ క్రియేట్ అయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ముంబైలో ఓ షెడ్యూల్ పూర్తిచేసుకుంది.
సైన్స్‌ఫిక్షన్ కథతో అంతర్జాతీయ స్థాయి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమాకు రూపకల్పన చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఆడియెన్స్ టార్గెట్‌గా రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ లొకేషన్స్ విషయంలో దర్శకుడు అట్లీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. ప్రస్తుతం లొకేషన్ రెక్కీలో భాగంగా ఆయన సౌదీ అరేబియాలో ఉన్నారు.
అక్కడి లివా ఏడారుల్లో సరైన లొకేషన్స్ కోసం అన్వేషిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను అట్లీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. తదుపరి షెడ్యూల్‌ను సౌదీలోనే తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పడుకోన్ కథానాయికగా నటిస్తున్నది.