తాజాగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో కెరీర్లో తొలి విజయాన్ని అందుకున్నది తెలుగమ్మాయి డింపుల్ హయాతి. త్వరలో మరికొన్ని సినిమాలతో ఈ అందాలభామ సందడి చేయనున్నది. ఇదిలావుంటే.. డింపుల్ హయాతి వివాహిత అని, తన భర్త పేరు డేవిడ్ అని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు డింపుల్ స్పందిస్తూ, తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది.
‘నాకు పెళ్లి అయ్యిందంటూ గతంలో చాలామంది రాశారు. అవన్నీ అబద్ధాలే. నేను అవివాహితను. ఇలాంటి వార్తలు నా కెరీర్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. అందుకే వివరణ ఇస్తున్నా.’ అని చెప్పుకొచ్చింది డింపుల్ హయాతి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సమాధానం వైరల్ అవుతున్నది.