హైదరాబాద్: బాలీవుడ్ మేటి నటుడు దిలీప్ కుమార్ మృతి పట్ల .. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నివాళి అర్పించారు. దిలీప్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు. భారతీయ చలనచిత్ర రంగంలో తరతరాలకు ఎందరో నటులను తీర్చిదిద్దడంలో దిలీప్ కుమార్ స్పూర్తిగా నిలిచారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎన్నో అద్భుత, మధుర జ్ఞపకాలను అందించిన దిలీప్ సాహెబ్‌కు ఆయన తన ట్వీట్లో థ్యాంక్స్ తెలిపారు. 98 ఏళ్ల దిలీప్ కుమార్ ఇవాళ ముంబైలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. మొఘల్ ఏ ఆజమ్, దేవదాస్, అందాజ్ లాంటి ఫేమస్ చిత్రాల్లో ఆయన నటించారు. 1950, 60 దశకంలో ఆయన సూపర్‌స్టార్ హీరోగా కీర్తికెక్కారు.
Deepest condolences to the legendary actor #DileepKumar ji. He has inspired generations of film actors across the various streams of Indian cinema. Thank you for all the memories sir! pic.twitter.com/O7EAsucJgt
— KTR (@KTRTRS) July 7, 2021