Dil Raju | దిల్ రాజు ఇండస్ట్రీలోని టాప్ ప్రొడ్యూసర్స్‌లో ఒకరు అనే విషయం తెలిసిందే. ఆయన పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీకి మంచి హిట్స్ అందించాడు. ఇటీవల దిల్ రాజు డ్రీమ్స్ అనే వెబ్ సైట్‌ని లాంచ్ చేశాడు. పరిశ్రమకు పరిచయం కావాలనుకునేవారికి ఇది సరైన వేదిక అవుతుందనే ఆలోచనతో ఈ ‘దిల్‌రాజు డ్రీమ్స్’ అనే వెబ్‌సైట్‌ని స్టార్ట్ చేశాం అని దిల్‌రాజు తెలిపారు. అయితే దిల్ రాజు పర్సనల్ లైఫ్ ఒకసారి చూస్తే అతని భార్య అనిత కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్యంతో కన్నుమూసింది. కొద్ది రోజుల తర్వాత తేజస్విని అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఇటీవల ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ టాపిక్‌గా మారుతుంది.
దిల్ రాజు భార్య తేజస్విని గతంతో పోల్చితే తన వ్యక్తిగత జీవితంలోనూ, వృత్తిపరమైన విషయాలల్లోనూ ఓపెన్‌గా మాట్లాడుతూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారింది. ఇటీవల భర్తతో కలిసి పారిస్‌కి వెకేషన్‌కి వెళ్లిన సందర్భంగా అక్కడి ఫొటోలు తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి నెటిజన్లను ఆకట్టుకుంది.ఇదిలా ఉండగా, పెళ్లి తర్వాత తొలిసారి ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేజస్విని తన చదువు, కెరీర్, ప్రేమ, పెళ్లి వంటి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. “హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. నా విద్యాభ్యాసం మొత్తం గర్ల్స్ ఇన్‌స్టిట్యూషన్లలోనే సాగింది. స్కూలింగ్ సెయింట్ ఆన్స్‌లో, ఇంటర్ శ్రీ చైతన్యలో పూర్తయ్యింది. డిగ్రీను కస్తూరిబా గాంధీ కళాశాలలో చేసి, నాచారంలోని సెయింట్ పియస్ కళాశాలలో బయోకెమిస్ట్రీలో పీజీ పూర్తిచేశాను. మా అమ్మ హైకోర్ట్ అడ్వకేట్.
ఆమెను చూసి నాకు కూడా లా పట్ల ఆసక్తి వచ్చింది. అందుకే పీజీ తర్వాత పెండేకంటి లా కాలేజీలో లా చదవడం ప్రారంభించాను. ఆ సమయంలోనే దిల్ రాజు గారితో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా చదువుతూనే 2024లో లా పూర్తి చేశాను. నేనొక మంచి స్టూడెంట్ అని గర్వంగా చెప్పగలను అని తేజస్విని చెప్పారు.కేవలం చదువు మాత్రమే కాదు, తేజస్వినికి కళలపై కూడా మంచి పట్టు ఉంది. ముఖ్యంగా క్లాసికల్ డ్యాన్స్‌లో ప్రావీణ్యం కలిగి ఉండి, పలు స్టేజ్ పర్ఫార్మెన్సులు కూడా ఇచ్చింది.