కోలీవుడ్ అగ్రనటుడు విజయ్ దళపతిపై అగ్రనిర్మాత దిల్రాజు ప్రశంసల వర్షం కురిపించారు. విజయ్ పనితీరు వల్ల సినిమా అనుకున్న సమయానికి పూర్తవుతుందని, నిర్మాతలకు కూడా ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుందని, టాలీవుడ్ హీరోలు కూడా ఆయన పనితీరును అనుసరిస్తే బావుంటుందని దిల్రాజు సూచించారు. ‘విజయ్ వర్కింగ్ ైస్టెల్ భిన్నంగా ఉంటుంది. సినిమాకు మొత్తం 120రోజుల కాల్షిట్లు అవసరం అయితే..
ఆయన ప్రతి నెలా 20 రోజులు కేటాయిస్తానని ముందే చెప్పేస్తారు. దీనివల్ల అనుకున్న సమయానికి సినిమా పూర్తవుతుంది. ప్రీప్రొడక్షన్కి ఇంకాస్త ఎక్కువ సమయం తీసుకుని, ఆరు నెల్లలో సినిమా షూట్ పూర్తి చేస్తారు. ఈ విధానం ఇతర హీరోలు కూడా ఫాలో అయితే.. నిర్మాతల నెత్తిన పాలు పోసినట్టే.’ అని అభిప్రాయపడ్డారు దిల్రాజు. విజయ్ కథానాయకుడిగా దిల్రాజు ‘వారిసు’ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.