Dasari Kondappa | భారతదేశంలోని అత్యున్నత పౌరపురస్కారమైన పద్మా అవార్డులను కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలకు కేంద్రం ఎంపిక చేసింది. మొత్తం 34 మందికి ఈ పురస్కారాలను ప్రకటించగా.. అందులో ఐదుగురు తెలుగువాళ్లు ఉన్నారు. ఇందులో తెలంగాణకు చెందిన బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప(Dasari Kondappa) కూడా ఎంపిక అయ్యాడు. దాదాపు 50 ఏళ్ళ నుండి బుర్రవీణ సంగీత పరికరంతో పలు పల్లెజానపదాలు పాడుతూ తెలంగాణ సంసృతిని చాటుతున్నారు దాసరి కొండప్ప. గత ఏడాది వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ తెలుగు మూవీ బలగంలో అయ్యో శివుడా ఏమాయె అనే పాట కూడా పాడి నటించారు కొండప్ప.
ఇక పద్మ అవార్డు రావడం పట్ల ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు దాసరి కొండప్పకు శుభాఖాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా బలగం సినిమా యూనిట్ కూడా దాసరి కొండప్పని సన్మానించింది. ఎస్వీసీ (Sri Venkateswara Creations) ఆఫీస్ కి వచ్చిన దాసరి కొండప్పని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సన్మానించాడు. అనంతరం ఆర్ధిక సహాయం కింద లక్ష రూపాయల చెక్కును అందచేశారు. ఇక ఈ కార్యక్రమంలో దిల్ రాజుతో పాటు బలగం దర్శకుడు వేణు, తదితరులు పాల్గొన్నారు.
#DasariKondappa garu who sang a song and acted in the film #Balagam has been awarded the PRESTIGIOUS PADMA SHRI ❤️
The entire team met him, felicitated him and presented a cheque of 1 Lakh as a token of appreciation!@VenuYeldandi9 @PriyadarshiPN @kavyakalyanram @dopvenu… pic.twitter.com/AU8My4IgFi
— Vamsi Kaka (@vamsikaka) February 3, 2024