అగ్ర నిర్మాత దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఓ మైథలాజికల్ ఫాంటసీ చిత్రాన్ని నిర్మించనున్నారట. సినిమా పేరు ‘జటాయు’. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ కథపై రెండేళ్లుగా కసరత్తులు చేస్తున్నారట. ఈ సినిమాలో హీరోగా ముందు విజయ్ దేవరకొండను అనుకున్నారు. ఆయన డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతో ఆ స్థానంలోకి శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా వచ్చి చేరాడని వినికిడి. ఈ ఏడాది దసరా తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలుకానున్నట్టు విశ్వసనీయ సమాచారం. దర్శకుడు ఇంద్రగంటికి ఇప్పుడు అర్జంట్‌గా హిట్ కావాలి. అలాగే తన కెరీర్‌కి బలమైన పునాది వేయగలిగేంత విజయం హీరో రోషన్ మేకాకు కావాలి. మరోవైపు నిర్మాత దిల్ రాజుకి కూడా ఓ బ్లాక్‌బస్టర్ అవసరం. అందుకే రిస్క్ అయినా.. కథపై నమ్మకంతో ఈ భారీ ప్రాజెక్ట్‌ని నిర్మించేందుకు సిద్ధమయ్యారట దిల్‌రాజు. ప్రస్తుతం దేవరకొండ విజయ్ ‘రౌడీ జనార్దన్’, దేవిశ్రీప్రసాద్ హీరోగా ‘ఎల్లమ్మ’, అశిష్‌రెడ్డి ‘దేత్తడి’ చిత్రాలతోపాటు సల్మాన్‌ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ బాలీవుడ్ సినిమాను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు దిల్ రాజు.