కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో సెలబ్రిటీలు విహార యాత్రలకు వెళుతున్నారు. కొందరు దైవ సన్నిధాలకు వెళుతుండగా, మరి కొందరు టూరిజం ప్లేస్‌లకు వెళుతున్నారు. అయితే ఈ మధ్య తిరుమలకు సినీ సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు. సమంత, మంచు లక్మీ, మంచు మనోజ్ వంటి వారు ఇప్పటికే శ్రీ వారిని దర్శించుకోగా ఇప్పుడు దిల్ రాజు, వంశీ పైడిపల్లి ఆయన కుటుంబ సభ్యులు తిరమలను సందర్శించారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో వారు పాల్గొన్నట్టు తెలుస్తుంది.
దిల్ రాజు, వంశీ పైడిపల్లి తొలి సారి తమిళ హీరో విజయ్ తో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనుండగా, దిల్ రాజు, శిరీష్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో నిర్మించనున్నారు. రీసెంట్గా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియల్ ప్రకటన చేశారు. దిల్ రాజు, వంశీ పైడిపల్లి, విజయ్ ముగ్గురూ కలిసి ఉన్న పిక్ రిలీజ్ చేస్తూ అసలు విషయం చెప్పారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం త్వరలో ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్తుంది. ఇప్పటికే తమిళ హీరోతో శేఖర్ కమ్ముల పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్లాన్ చేయగా, ఇప్పుడు విజయ్- వంశీ పైడిపల్లి కాంబినేషన్లో సినిమా రానుండడం ఆసక్తిగా మారింది.
National Award Winning Producer, Director #DilRaju & @directorvamshi
— BA Raju's Team (@baraju_SuperHit) September 27, 2021
visited Thirumala thirupathi devasathanam. ✨@actorvijay @SVC_official #Shirish#Thalapathy66 pic.twitter.com/3dztjZ8Ibm