Vande Mataram Debate | శీతకాల లోక్సభ సమావేశల్లో భాగంగా భారత పార్లమెంటులో వందేమాతరంపై చర్చ జరిగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నెహ్రుని తప్పుబడుతూ.. ప్రధాని మోదీ ఈ చర్చను తెరపైకి తీసుకురాగా.. ఈ సుదీర్ఘ చర్చను తీవ్రంగా తప్పుబట్టాడు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, గాయకుడు విశాల్ దద్లానీ. దాదాపు 10 గంటల పాటు కేవలం ఒక దేశభక్తి గీతంపైనే చర్చించడం సమయం మరియు ప్రజాధనం వృథా చేయడమేనని ఆయన మండిపడ్డారు.
సోషల్ మీడియాలో ఈ విషయంపై మాట్లాడుతూ… వందేమాతరంపై పార్లమెంటులో 10 గంటల పాటు చర్చ జరిగింది కాబట్టి.. దేశంలో ప్రస్తుతం తీవ్రంగా ఉన్న నిరుద్యోగం, వాయు కాలుష్యం, విమానయాన సంస్థల సమస్యలు వంటి కీలక సమస్యలన్నీ పరిష్కారమైపోయాయా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. దేశం ఎదుర్కొంటున్న అసలు సమస్యలైన నిరుద్యోగం, పర్యావరణ పరిరక్షణ వంటి వాటి గురించి చర్చించకుండా, కేవలం ‘వందేమాతరం’ యొక్క చారిత్రక, సాంస్కృతిక అంశాల కోసం అంత విలువైన సమయాన్ని కేటాయించడంపై విశాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంటులో ఒక నిమిషం చర్చకు రూ. 2.5 లక్షలు ఖర్చవుతుంది. 10 గంటల పాటు జరిగిన ఈ చర్చకు అయిన మొత్తం ప్రజాధనం ఎంత?” అని దద్లానీ ప్రశ్నిస్తూ, ఈ ఖర్చును లెక్కించాలని డిమాండ్ చేశారు. దద్లానీ చేసిన ఈ విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్ల నుండి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి.
बॉलीवुड सिंगर Vishal Dadlani ने संसद में ‘वंदे मातरम’ पर हुई लंबी बहस को लेकर नाराज़गी जताई। सोशल मीडिया पर तंज कसते हुए लिखा, “लगता है अब बेरोज़गारी, इंडिगो की समस्या और प्रदूषण जैसे बड़े मुद्दे भी हल हो गए हैं।”
@VishalDadlani#VishalDadlani #Parliament #VandeMataram… pic.twitter.com/BwNrM1Nd2w
— PRIYA RANA (@priyarana3101) December 10, 2025