Surrogacy | నయనతార ఈ వివాదాన్ని ముందే ఊహించిందా.. ఆమె రియాక్షన్ ఇదేనా..?
పెళ్లైన 4 నెలలకే కవల పిల్లకు పేరెంట్స్ అయ్యారు నయనతార, విగ్నేష్ దంపతులు. వీళ్ళు చాలా రోజులుగా పిల్లల గురించి మాట్లాడుకుంటున్నారు కానీ ఇలా సరోగసి పద్ధతిలో అమ్మానాన్న అవుతారని ఎవరు ఊహించలేదు.
Surrogacy | చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో సరోగసి అనే పదం మళ్లీ ట్రెండింగ్ అవుతుంది. దానికి కారణం నాయనతార అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెళ్లైన 4 నెలలకే కవల పిల్లకు పేరెంట్స్ అయ్యారు నయనతార, విగ్నేష్ దంపతులు. వీళ్ళు చాలా రోజులుగా పిల్లల గురించి మాట్లాడుకుంటున్నారు కానీ ఇలా సరోగసి పద్ధతిలో అమ్మానాన్న అవుతారని ఎవరు ఊహించలేదు.
ముందు నుంచి దాని గురించి చెప్పకుండా జాగ్రత్త పడ్డారు నయనతార జోడి. తమ ఇద్దరు కవల పిల్లలను ప్రపంచానికి పరిచయం చేయగానే కొందరు దాని పాజిటివ్ గా తీసుకున్నారు.. మరికొందరు నెగిటివ్ గా రిసీవ్ చేసుకున్నారు. ఇండియాలో సరోగసి బ్యాన్ అయింది.. జనవరి 2022 నుంచి ఇక్కడ అద్దె గర్భం మోయాలి అంటే కచ్చితంగా దానికి తగిన కారణాలు ఉండాలి.. అత్యవసరమైతే తప్ప సరోగసి వైపు వెళ్ళకూడదు అని చట్టాలు చెబుతున్నాయి.
ఈ విషయం తెలిసి కూడా నయనతార, విగ్నేష్ శివన్ సరోగసీ వైపు వెళ్లారు అంటే.. ముందుగానే ఈ కాంట్రవర్సీ ఊహించారని అర్థమవుతుంది. వివాదం చెలరేగుతుందని తెలిసినా కూడా వాళ్ళు వెనక్కి తగ్గలేదు. నయనతారకు పిల్లలు అంటే చాలా ఇష్టం. ఈ విషయం చాలా సార్లు చాలా ఇంటర్వ్యూలలో కూడా చెప్పింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె అమ్మ అయితే కచ్చితంగా తన హీరోయిన్ కెరీర్ కు ఫుల్ స్టాప్ పడుతుందని.. అందం చెడిపోతుందని సరోగసి వైపు వెళ్లి ఉండొచ్చు అని అర్థమవుతుంది.
అయితే అమ్మ అవడం అనేది మహిళకు ఒక అద్భుతమైన అవకాశం.. దాన్ని కూడా మరొకరి ద్వారా పొందడం అనే శాపం మరొకటి లేదు అంటూ నయనతారపై సోషల్ మీడియాలో విమర్శలు కూడా వస్తున్నాయి. వీటన్నింటికీ నయన్ ఒకే ఒక రియాక్షన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక్కడ నాకు చాలా పని ఉంది.. జరిగే ప్రతి కాంట్రవర్సీ నా మూలంగా కాదు.. ఒకవేళ వాళ్ళు కాంట్రవర్సీ చేస్తే దానికి స్పందించాల్సిన అవసరం నాకు లేదని సన్నిహితులతో నయన్ చెప్పినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ సరోగసి చట్టబద్ధంగా జరిగిందా లేదా అని విచారణకు ఆదేశించింది. దీనిపై కూడా నయనతార దంపతులు ఎలాంటి సమస్యనైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వాళ్ళను చూస్తుంటే అర్థం అవుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

