Dhurandhar | బాలీవుడ్ బాక్సాఫీస్‌ను కుదిపేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ (Dhurandhar) ఇప్పుడు ఓటీటీ ఎంట్రీ కోసం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది. రణ్వీర్ సింగ్ కెరీర్లోనే టాప్ గ్రాసర్‌గా నిలిచిన ఈ సినిమా, ఉత్తర భారతంలో రికార్డులు సృష్టించినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం థియేటర్లో పూర్తి అనుభూతి అందించలేకపోయింది. కారణం ఒక్కటే, తెలుగు డబ్బింగ్ లేకపోవడం. థియేటర్లలో ఆ లోటుతో వెనుకబడ్డ తెలుగు ఫ్యాన్స్, ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో అయినా పూర్తి స్థాయిలో చూడాలని ఆశపడుతున్నారు. అందుకే ధురందర్ ఓటీటీ రిలీజ్‌పై చర్చలు హాట్ టాపిక్‌గా మారాయి.
డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ Netflix దక్కించుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో జనవరి 30, 2026న స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందన్న ప్రచారం ఊపందుకుంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచే సినిమా వస్తుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. అయితే, ఇక్కడే క్లారిటీ కొరవడుతోంది. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సాధారణంగా పెద్ద సినిమాలకు ముందుగానే “Coming Soon” పోస్టర్లతో బజ్ క్రియేట్ చేస్తారు. కానీ ‘ధురంధర్’ విషయంలో ఆ సైలెన్స్ కొనసాగుతుండటంతో సర్ప్రైజ్ డిలే అవుతుందా? లేక డేట్ షిఫ్ట్ అవుతుందా? అన్న సందేహాలు పెరుగుతున్నాయి.
అయితే వచ్చిన కూడా తెలుగు ఆడియో ఉంటుందా అని? . దీనిపై అధికారిక సమాచారం లేదు, కానీ విశ్లేషకులు మాత్రం “కచ్చితంగా ఉంటుంది” అని అంచనా వేస్తున్నారు. ‘ధురంధర్: ది రివెంజ్’ పేరుతో పార్ట్ 2 పాన్-ఇండియా స్థాయిలో మార్చి 19, 2026న విడుదలకు సిద్ధమవుతోంది. పార్ట్ 2కి ముందు పార్ట్ 1 తెలుగు ప్రేక్షకులకు చేరితే మార్కెట్ బలపడుతుంది. పెద్ద బడ్జెట్ సినిమాలను మల్టీ-ఆడియోలో రిలీజ్ చేయడం నెట్‌ఫ్లిక్స్‌కు అలవాటు. రణ్వీర్ సింగ్‌కు సౌత్‌లో ఉన్న ఫ్యాన్‌బేస్ దృష్ట్యా తెలుగు వెర్షన్ జోడించే అవకాశాలు ఎక్కువ. చూడాలి మరి ఏం జరుగుతుందో. ‘యూరీ’ ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హై-ఇంటెన్సిటీ స్పై థ్రిల్లర్‌గా రూపొందింది. రణ్వీర్ సింగ్‌తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషించారు.