తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థగా పేరుపొందిన మైత్రీ మూవీ మేకర్స్ తమిళంలో కూడా భారీ చిత్రాలను తెరకెక్కిస్తున్నది. ఈ సంస్థ తమిళంలో రూపొందిస్తున్న నాలుగో చిత్రం గురువారం చెన్నైలో లాంఛనంగా ప్రారంభమైంది.
విక్రమ్ తనయుడు ధృవ్విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి అరవింద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ నేపథ్య కథాంశమిదని, ధృవ్ పాత్ర సరికొత్త పంథాలో ఉంటుందని నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.