Dhruv Vikram | తమిళ అగ్ర నటుడు విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన ‘బైసన్’ (Bison) చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ చిత్రం విడుదలైన 10 రోజుల్లోనే రూ.55 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు మారి సెల్వరాజ్ తెలుపుతూ.. బైసన్ రన్ ఇంకా కొనసాగుతుంది. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు అంటూ రాసుకోచ్చాడు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో రెండో వారంలో ఈ చిత్రానికి భారీగా స్క్రీన్స్ పెరిగాయి. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, కేరళలో థియేటర్లు పెరగడంతో మంచి కలెక్షన్లు రాబడుతుంది ఈ చిత్రం.
ధ్రువ్ విక్రమ్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా నటించిన ఈ సినిమాకు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను పా.రంజిత్ నీలం ప్రొడక్షన్స్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, శాంతి సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. పశుపతి, రజిషా విజయన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.
Ecstatic beyond measure and thankful beyond words!! #BisonKaalamaadan is unstoppable as he’s breaking those barriers right away!!💥🦬
55 Crores Worldwide in 10 days!! #Blockbuster Raid in the Theatres Near You! 💥💥💥@applausesocial @NeelamStudios_ @nairsameer @deepaksegal… pic.twitter.com/ozbbqRLl7S
— Mari Selvaraj (@mari_selvaraj) October 27, 2025