చేతన్‌కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ధూం ధాం’. సాయికిశోర్ మచ్చా దర్శకుడు. ఎం.ఎస్.రామ్‌కుమార్ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు.
గాయని మంగ్లీ పాడుతూ, ఈ పాటలో నర్తించినట్టు సాంగ్ ప్రోమోలో తెలుస్తున్నది. ‘మల్లెపూల ట్యాక్సీ తేరా మల్లేశా..’ అంటూ సాగిన ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా, గోపీసుందర్ స్వరపరిచారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాలో సాయికుమార్, వెన్నెల కిశోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: ప్రవీణ్‌వర్మ, కెమెరా: సిద్ధార్థ్ రామస్వామి, నిర్మాణం: ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్.