Ram Charan | టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్ (Ram Charan) ప్రస్తుతం ముంబై (Mumbai) పర్యటనలో ఉన్నారు. బుధవారం ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయాన్ని (Siddhivinayak Temple) సందర్శించిన రామ్‌చరణ్.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా చరణ్‌కు ఆలయ పూజారులు శాలువాతో సత్కరించారు.
అయితే ఈ ఆలయ సందర్శన అనంతరం రామ్ చరణ్ టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనిని కలుసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరూ.. ఒక యాడ్ షూట్ కోసం కలుసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
A latest pic of Actor @AlwaysRamCharan and #Dhoni from Mumbai pic.twitter.com/dkV8ekgpW9
— Ramesh Bala (@rameshlaus) October 4, 2023
మరోవైపు ఈ ఫొటోలలో ధోనీ(MS Dhoni).. కొత్త లుక్‌లో దర్శనమిస్తున్నాడు. చాలా స్టయిలిస్ లుక్‌తో అట్రాక్ట్ చేస్తున్నాడు. కొత్త తరహా హెయిర్ స్టయిల్‌తో డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో టార్జన్ తరహా హెయిర్ స్టయిల్‌తో కిక్ ఇచ్చిన ధోనీ, మళ్లీ ఇప్పుడు దాదాపు అలాంటి హెయిర్ స్టయిల్‌తో దర్శనమిచ్చాడు. యాడ్ షూట్ కోసం ధోనీ తన తల వెంట్రుకల్ని పెంచేశాడు.