రవితేజ నున్న, నేహా జురెల్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘రాజుగారి అమ్మాయి – నాయుడుగారి అబ్బాయి’. సత్యరాజ్ దర్శకుడు. రామిశెట్టి సుబ్బారావు, ముత్యాల రామదాసు నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకోసం రెహమాన్ సాహిత్యంతో, రోషన్ సాలూరి సంగీతంతో, సాహితి చాగంటి ఆలపించిన ‘ధిర ధిరనా..’ అంటూ సాగే పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
యువతరాన్ని ఆకట్టుకునేలా ఈ పాటను చిత్రీకరించడం జరిగిందని, నేటి కుర్రకారుకి కొత్త అనుభూతిని పంచే సినిమా ఇదని చిత్ర బృందం చెబుతున్నది. అతి త్వరలో ట్రైలర్‌ని, త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. నాగినీడు, ప్రమోదిని, జబర్దస్త్ బాబీ, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మురళికృష్ణవర్మ.