లక్ష్ చదలవాడ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ధీర’. ‘ఏ ఫిలింబై అరవింద్’ ఫేం శేఖర్సూరి దర్శకుడు. పద్మావతి చదలవాడ నిర్మాత. ఈ చిత్రం పోస్టర్ని హైదరాబాద్లో విడుదల చేశారు.
‘నా గత చిత్రాల మాదిరిగానే సస్పెన్స్ థ్రిల్లర్గా సినిమా ఉంటుంది. ఊహించని మలుపులతో సాగే సినిమా ఇది. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో ప్రకటిస్తాం’ అని శేఖర్సూరి చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: చదలవాడ బ్రదర్స్, నిర్మాణం: శ్రీతిరుమల తిరుపతి వేంకటేశ్వరా ఫిలింస్.