గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రామబాణం’. శ్రీవాస్ దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘దరువెయ్యరా’ అంటూ సాగే రెండో గీతాన్ని శుక్రవారం ఏపీలోని కర్నూల్లో జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు.
గోపీచంద్ మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ మంచి పాటలిచ్చారు. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే కథ ఇది’ అన్నారు. ‘ఈ రామబాణం తప్పకుండా దూసుకుపోతుందనే నమ్మకం ఉంది. గోపీచంద్ అభిమానులు మెచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. యాక్షన్ మరో స్థాయిలో ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రతి ఒక్కరిని ఉద్వేగానికి గురిచేస్తాయి’ అని దర్శకుడు శ్రీవాస్ తెలిపారు.