ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సార్’. వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ- ఎస్. సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. సంయుక్త మీనన్ కథానాయిక. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సందర్భంగా సోమవారం ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఇందులో హీరో ధనుష్ క్లాస్‌రూంలో విద్యార్థులకు గణితం పాఠాలు బోధిస్తూ కనిపిస్తున్నారు. నేటి విద్యావ్యవస్థ తీరుతెన్నుల్ని చర్చిస్తూ వాటిలో సంస్కరణ కోసం కథానాయకుడు చేసే పోరాటం, ఈ క్రమంలో ఎదురైన సమస్యల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. సమాజ శ్రేయస్సు కోసం తపించే ఉపాధ్యాయుడి కథ ఇదని దర్శకుడు తెలిపారు. తమిళ, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. సాయికుమార్, తనికెళ్ల భరణి, సముద్రఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జె.యువరాజ్, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, సమర్పణ: శ్రీకర స్టూడియోస్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, రచన-దర్శకత్వం: వెంకీ అట్లూరి.