Kara Movie | ధనుష్ మార్కెట్, బలమైన కంటెంట్ మా సినిమాకు శ్రీరామరక్ష.. ‘కర’ నిర్మాత సతీష్ కుమార్
Dhanush New Movie | తమిళ నటుడు ధనుష్, మమితా బైజు జంటగా విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కర’.
తమిళ నటుడు ధనుష్, మమితా బైజు జంటగా విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కర’. డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న తెలుగు ప్రేక్షకుల ముందుకు విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ సంస్థలు సంయుక్తంగా తీసుకువస్తున్నాయి. ఈ సందర్భంగా విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ అధినేత సీహెచ్. సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. సినిమాపై ఉన్న తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో అర్జున్ రెడ్డి, కబాలి, సలార్ వంటి భారీ చిత్రాలను పంపిణీ చేసిన అనుభవంతో, ధనుష్ గారి ‘ధర్మయోగి’ తర్వాత మళ్లీ ఆయన సినిమాను తెలుగులో రిలీజ్ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సినిమాను దక్కించుకోవడానికి తాను స్వయంగా నిర్మాతను కలిసి ఒప్పించానని, ఇప్పటికే 80 శాతం బిజినెస్ పూర్తయిందని వెల్లడించారు.
ఒక సాధారణ మనిషి ఎదుర్కొనే సమస్యలను అత్యంత బలమైన ఎమోషనల్ కంటెంట్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో దర్శకుడు విఘ్నేశ్ రాజా అద్భుతంగా రూపొందించారని, ఇది ప్రతి సామాన్య ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కరస్వామి అనే వ్యక్తి చుట్టూ తిరిగే కథ కాబట్టే తెలుగులో కూడా ‘కర’ అనే పేరును ఖరారు చేశామని, జీవీ ప్రకాష్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. నైజాంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తుండగా, ఉత్తరాంధ్రలో తానే స్వయంగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు 400కు పైగా థియేటర్లలో, హిందీ వెర్షన్‌తో కలిపి మొత్తం 600 స్క్రీన్లలో ఈ సినిమా విడుదల కాబోతోంది. వేసవిలో ఇప్పటి వరకు పెద్ద సినిమాలేవీ లేకపోవడం ‘కర’ మూవీకి కలిసొచ్చే అంశమని, ప్రేక్షకులతో పాటు పరిశ్రమ వర్గాలు కూడా ఈ చిత్రానికి పూర్తి సహకారం అందిస్తాయని ఆశిస్తున్నట్లు సతీష్ కుమార్ పేర్కొన్నారు. లోకల్ విలేజ్ డ్రామాగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అందరికీ అర్థమయ్యే సమస్యలను ఈ చిత్రంలో చర్చించినట్లు ఆయన వివరించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

