Dhanush Kalam | ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 వేదికగా మరో సంచలనం చోటు చేసుకుంది. భారత రత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా ఒక బయోపిక్ తెరకెక్కబోతుండగా.. ఈ బయోపిక్‌ను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో జాతీయ అవార్డు గ్రహీత, బహుముఖ నటుడు ధనుష్ అబ్దుల్ కలాం పాత్రలో నటించనున్నారు.
కలాం అంటూ ఈ సినిమా రాబోతుండగా.. ‘తానాజీ: ది అన్ సంగ్ వారియర్’, ‘ఆదిపురుష్’ వంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఓం రౌత్ ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌కి దర్శకత్వం వహించనున్నారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘ది ఢిల్లీ ఫైల్స్’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన అభిషేక్ అగర్వాల్ (అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్), భూషణ్ కుమార్ (టి-సిరీస్), కృష్ణన్ కుమార్, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సైవిన్ క్వాడ్రాస్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.
కేన్స్ వేదికపై ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టర్లో డాక్టర్ కలాం బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌తో పాటు ఒక మిస్సైల్ చిత్రాన్ని చేర్చడం, కలాం భారత క్షిపణి సాంకేతికతకు చేసిన కృషిని సూచిస్తోంది. “రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ ఓ లెజెండ్ ప్రయాణం మొదలవుతుంది. భారత్ మిస్సైల్ మ్యాన్ వెండితెరపైకి రాబోతున్నారు. పెద్ద కలలు కనండి. మరింత ఎత్తుకు ఎదగండి మేకర్స్ పోస్ట్ చేశారు.
DHANUSH IN & AS DR APJ ABDUL KALAM – BIOPIC ANNOUNCED AT CANNES… OM RAUT TO DIRECT… #NationalAward-winning actor #Dhanush will portray the title role in #Kalam, a biopic on #BharatRatna Dr #APJAbdulKalam, the 11th President of India.
Directed by #OmRaut, the film is produced… pic.twitter.com/9hGEzZ5gFl
— taran adarsh (@taran_adarsh) May 21, 2025