Dhanush-Mrunal | టాలీవుడ్లో వరుస విజయాలతో ఓ వెలుగు వెలుగుతున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మరోసారి తన పర్సనల్ లైఫ్ కారణంగానే వార్తల్లో నిలిచింది. సీరియల్స్‌తో కెరీర్‌ను ప్రారంభించిన ఆమె, జెర్సీ రీమేక్‌లో నటించి మంచి ప్రశంసలు అందుకుంది. తరువాత వచ్చిన సీతారామం, హాయ్ నాన్న చిత్రాలు ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. అయితే, ప్రస్తుతం సినిమాల కంటే కూడా తమిళ స్టార్ హీరో ధనుష్‌తో రిలేషన్ షిప్ విషయంలో ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. ఇప్పటికే ధనుష్ తన భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ధనుష్ డైవర్స్ తీసుకున్న తర్వాత మృణాల్ ఠాకూర్‌తో ఆయనకు ప్రేమ సంబంధం ఉందన్న వార్తలు మొదలయ్యాయి.
మృణాల్ ఈ రూమర్లను ఖండించినప్పటికీ… ఇప్పుడు మరోసారి ఈ చర్చ మళ్లీ మొదలైంది.కారణం ఇన్‌స్టాగ్రామ్‌లో జరిగిన కామెంట్స్ ఎక్స్ఛేంజ్. మృణాల్ నటించిన ‘దో దీవానే షెహ్రర్ మే’ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. దీనిని ఆమె ఇన్‌స్టాలో షేర్ చేయగా ధనుష్ ఆ పోస్ట్‌పై “చాలా బాగుంది” అనే అర్థంలో కామెంట్ చేశారు. దీనికి మృణాల్ లవ్ సింబల్‌తో రిప్లై ఇవ్వడంతో ఈ స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఆ క్రమంలో నెటిజన్స్. ఇద్దరి మధ్య బంధం నిజమేనా?. త్వరలో కన్ఫాం చేస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ధనుష్, మృణాల్‌కి సంబంధించిన రూమర్స్ ఎప్పటి నుండో నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అయితే గతంలోనూ ఇదే ప్రచారం జరిగినప్పుడు మృణాల్ ఠాకూర్ ..తనకి ధనుష్ మధ్య అలాంటి సంబంధం ఏదీ లేదని స్పష్టం చేశారు. అయితే తాజా కామెంట్స్ ఎక్స్ఛేంజ్తో రూమర్స్ మళ్లీ ఊపందుకోవడం ఆసక్తిగా మారింది. ఈ విషయంపై ఇద్దరు సెలబ్రిటీలూ ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వకపోవడంతో, చర్చ సోషల్ మీడియాలో వేడెక్కుతోంది. ఇక ఇదిలా ఉంటే ఈ ఏడాది ఇప్పటికే కుబేర, ఇడ్లీకొట్టు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించిన ధనుష్.. ఈ నెల 28న ‘అమరకావ్యం’ చిత్రంతో ముచ్చటగా మూడోసారి రాబోతున్నారు.