అగ్ర హీరో ధనుష్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘నిలవుకు ఎన్ మేల్ ఎన్నాడి కోబమ్’ చిత్రం తెలుగులో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ పేరుతో ప్రేక్షకుల ముందుకురానుంది. ధనుష్ డైరెక్ట్ చేసిన మూడో చిత్రమిది. ఈ నెల 21న విడుదలకానుంది. పవీష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ తెలుగులో రిలీజ్ చేస్తున్నది. సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ ప్రారంభంలో కనిపించిన ధనుష్.. ప్రేమకథ గురించి వివరిస్తుంటాడు. ప్రేమ, బ్రేకప్ నేపథ్యంలో న్యూఏజ్ లవ్‌స్టోరీగా ఆద్యంతం చక్కటి హాస్యంతో ట్రైలర్ ఆకట్టుకుంది. మాజీ ప్రేయసి పెళ్లికి వెళ్లాల్సిన పరిస్థితి రావడం, అక్కడ ఎదురయ్యే సంఘటనలు అన్నీ యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్నందించారు.