నటుడిగానే కాక, గాయకుడిగా, పాటల రచయితగా, నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞ కనబరుస్తున్నారు తమిళ అగ్రనటుడు ధనుష్. ఆయన దర్శకత్వంలో వచ్చిన పా పాండి, రాయన్ చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఈ క్రమంలోనే ఆయన దర్శకత్వంలో రానున్న మూడవ సినిమా ‘నిలవక్కు ఎన్ మేల్ ఎన్నాడి కోబమ్’. ఈ తమిళ సినిమా ‘జాబిలమ్మ నీకు అంతకోపమా’ పేరుతో తెలుగులోనూ ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటైర్టెన్మెంట్స్ ఎల్ఎల్పి సంస్థ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నది.
ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో ప్రెస్మీట్ నిర్వహించారు. జాన్వి నారంగ్ మాట్లాడుతూ ‘ఈ సినిమాను తెలుగులో విడుదల చేసే అవకాశం ఇచ్చిన ధనుష్గారికి థాంక్స్. ఓ కొత్తరకం ప్రేమకథతో రానున్నాం.’ అని చెప్పారు. ఇంకా ఈ సినిమాలో నటించిన అనికా సురేంద్రన్, రబియా, వెంకటేష్ మీనన్, రమ్య రంగనాథన్, పవీష్ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: లియోన్ బ్రిట్టో, నిర్మాణం: వండర్బార్ ఫిల్మ్స్, ఆర్కె ప్రొడక్షన్స్.