Dhanush | టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్‌కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) కాంబోలో వస్తున్న చిత్రం DNS. హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంఛ్ కాగా.. స్టిల్స్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. రేపు మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం 4:05 గంటలకు సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారని వార్త తెరపైకి వచ్చింది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
తాజాగా డీఎస్పీ రాకింగ్ బీజీఎంతో DNS ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల కాబోతుందంటూ మేకర్స్ స్టూడియోలో ఉన్ లుక్‌ను షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కూరి రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.సోషల్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో కన్నడ సోయగం రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
రష్మిక ఇటీవలే హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌కు నుంచి విరామం తీసుకొని జపాన్‌లో జరిగిన అవార్డుల కార్యక్రమానికి వెళ్లగా.. ఈవెంట్ స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. DNS తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. DNS. లవ్స్టోరీలాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల (Shekhar Kammula) నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇదిలా ఉంటే ధనుష్ మరోవైపు స్వీయ దర్శకత్వంలో డీ50వ (D50) సినిమాలో కూడా నటిస్తున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్జే సూర్య ఈ ప్రాజెక్టులో కీ రోల్ చేస్తున్నాడని కోలీవుడ్ సర్కిల్ టాక్.
#DNS – First Look and Title Motion Poster with DSP BGM..💥#Dhanush | #Nagarjuna | #Rashmika pic.twitter.com/QRhRALDMYP
— Laxmi Kanth (@iammoviebuff007) March 7, 2024
#DNS Title & FirstLook to be out on March 8th 4:05pm
Dhanush – Nagarjuna
A film by Sekar Kammula pic.twitter.com/vmTdCkZ6pL
— Karthik Ravivarma (@Karthikravivarm) March 7, 2024
DNS షూటింగ్ లొకేషన్ ఫొటోలు..
A blockbuster voyage that’s bound to resonate with the nation! 😎#DNS kicks off with a pooja ceremony and the shoot begins with a key schedule 🎥
More details on the way ⏳@dhanushkraja @iamnagarjuna @iamRashmika @sekharkammula @AsianSuniel @puskurrammohan @SVCLLP pic.twitter.com/bYBtyuwfGA
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) January 18, 2024