తమిళ అగ్రహీరో ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తమిళ, తెలుగుతో పాటు హిందీలో కూడా భారీ ప్రాజెక్ట్స్ ఆయన చేతిలో ఉన్నాయి. గురువారం ఆయన 56వ చిత్రం తాలూకు ప్రకటన వెలువడింది. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. గతంలో ధనుష్-మారి సెల్వరాజ్ కాంబినేషన్లో ‘కర్ణన్’ అనే బ్లాక్‌బస్టర్ సినిమా రావడంతో తాజా ప్రాజెక్ట్ అభిమానుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది.
ఈ సినిమా అనౌన్స్మెంట్ సందర్భంగా గురువారం ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనికి ‘త్వరలోనే గొప్ప యుద్ధం ప్రారంభం కానుంది’ అనే క్యాప్షన్‌ను జత చేశారు. దీంతో ఈ సినిమా బ్యాక్‌డ్రాప్ ఏమైఉంటుందోనని అభిమానులు చర్చించుకుంటున్నారు. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి కె గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ధనుష్ కుబేర, ఇడ్లీ కడై, తేరే ఇష్క్‌మే చిత్రాల్లో నటిస్తున్నారు.