Dhanraj | బుల్లితెర, వెండితెర ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు ధనరాజ్. ఇప్పుడంటే జబర్ధస్త్ షోలో ఇంత మంది కమెడీయన్స్ కనిపిస్తున్నారు కాని అప్పుడు లిమిటెడ్గా ఉండేవారు. వారిలో ధన్రాజ్ ఒకరు. ధనాధన్ ధన్రాజ్గా బుల్లితెరపై మంచి పేరు ప్రఖ్యాతలు అందుకున్న ధన్రాజ్ ఆ తర్వాత వెండితెరపై కూడా అలరించాడు. ఇప్పుడు లైఫ్లో బాగానే సెటిలయ్యాయి. అయితే ఒకప్పుడు ధన్ రాజ్ చాలా కష్టాలు అనుభవించాడు. ఎన్నో కష్టాలని, బాధలని ఫేస్ చేస్తూ ఈ స్థాయికి చేరుకున్న ధన్ రాజ్ గురించి ఆయన భార్య శిరీష ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
ధనరాజ్ది విజయవాడ.నాది ఖమ్మం.అయితే ధనరాజ్ ఫిలిం నగర్ లో ఒక డ్యాన్స్ స్టూడియో పెట్టినప్పుడు టీచర్ కోసం వెతుకుతున్నారు. నేను క్లాసికల్ డ్యాన్సర్ కాగా, అలా నన్ను కలిశాడు ధన్రాజ్.అదృష్టమో, దురదృష్టమో తెలీదు కానీ నేను పరిచయమైన రోజే అతడి అమ్మ క్యాన్సర్ తో చనిపోయింది. అయితే ఆ సమయంలో తల్లి అంత్యక్రియలు చేయడానికి కూడా ధన్రాజ్ దగ్గర డబ్బులు లేకపోతే నా బంగారం ఇచ్చేశాను. నవంబర్లో ఆయన తల్లి మరణించగా, మార్చిలో మా వివాహం జరిగింది. రేపు మన పెళ్లి అనగానే సరేనని తలూపడంతో 15 ఏళ్లకే ఇంట్లో వాళ్లని కాదని ఆయనని వివాహం చేసుకున్నాను.
నిర్మాతగా ధన్రాజ్ ధనలక్ష్మీ తలుపు తడితే అనే సినిమా చేశాడు. ఈ సినిమా సినిమా పోతే జీరో నుంచి మొదలు పెట్టాల్సిందే అని హెచ్చరించాను. అయిన తీసాడు. నేను అనుకున్నట్లుగానే జీరో నుంచి మళ్లీ స్టార్ట్ చేశాం.ఇక మా గురించి సోషల్ మీడియాలో ఏవేవో ప్రచారాలు చేస్తారు. రోడ్డున పడ్డామని, ఇల్లు అమ్ముకున్నామని ప్రచారం చేశారు. ఈ మధ్య విడాకులు తీసుకుంటున్నారని ప్రచారం చేశారు. మా మధ్య చిన్న చితకా గొడవలు రావడం వలన వారం పది రోజులపాటు మాట్లాడుకోకుండా ఉంటామేమో తప్ప విడాకులు తీసుకునేంత సీన్ లేదు. మేము చాలా సంతోషంగా ఉన్నాము. సుడిగాలి సుధీర్ ఎక్కువగా మా ఇంటికి వస్తాడు. అతను పెళ్లి చేసుకోను అని అంటున్నాడు అని తెలిపింది శిరీష.