టాలీవుడ్ హీరో రవితేజ (Ravi Teja) ఫుల్ స్పీడుమీదున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పక్కా వినోదం అందించడమే లక్ష్యంగా దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina) డైరెక్షన్లో తెరకెక్కుతున్న ధమాకా (Dhamaka) చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ ఇటీవలే మొదలైన విషయం తెలిసిందే. ఫైట్ మాస్టర్ రామ్-లక్ష్మణ్ (Ram Lakshman) పర్యవేక్షణలో యాక్షన్ సీన్లను చిత్రీకరించారు.
తాజాగా నాలుగో షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసింది రవితేజ అండ్ టీం. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్‌మీడియాలో ఓ స్టిల్‌ను పోస్ట్ చేశారు మేకర్స్. రవితేజ, డైరెక్టర్ అండ్ చిత్రయూనిట్ లొకేషన్లో దిగిన ఫొటోను షేర్ చేయగా..ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పెళ్లి సందD ఫేం శ్రీలీల ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
Another Schedule Wrap 🥳🤘
Mass Maharaja @RaviTeja_offl😎#Dhamaka ⚡️Wrapped up the 4th Schedule on a High Note🔥
Gearing up for DHAMAKEDAR ENTERTAINMENT💥in Cinemas 🔜@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @peoplemediafcy @AAArtsOfficial @vivekkuchibotla @dhamakaoffcl pic.twitter.com/6ZIK7WLsZL
— People Media Factory (@peoplemediafcy) March 2, 2022
భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తుండగా..కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్‌గా వర్క్ చేస్తున్నాడు. సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.