Yellamma | బలగం సినిమాతో డైరెక్టర్‌గా సూపర్ బ్రేక్ అందుకున్నాడు వేణు యెల్దండి. ప్రస్తుతం ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఫోకస్ అంతా ఎల్లమ్మ సినిమాపైనే ఉంది. ఈ చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఫైనల్ అయిందని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. కాగా ఇప్పుడొక ఆసక్తికర వార్త నెట్టింట రౌండప్ చేస్తోంది.
ఈ చిత్రంలో హీరోగా నటించడమే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడట డీఎస్పీ. దిల్ రాజు, వేణు మ్యూజిక్ కంపోజర్ కోసం బాలీవుడ్ మ్యూజిక్ ద్వయం అజయ్-అతుల్‌ను ఒకే చేయడమే కాకుండా అడ్వాన్స్ కూడా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో దిల్ రాజు ఎల్లమ్మ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా అజయ్-అతుల్‌ను ఒకే చేస్తారా..? లేదంటే దేవీ శ్రీ ప్రసాద్‌కే ఆ ఛాన్స్ ఇస్తారా..? అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవేళ డీఎస్పీనే ఫైనల్ చేస్తే ఎల్లమ్మ సినిమా కోసం ఒకేసారి రెండు బాధ్యతలు తీసుకోబోతున్నాడన్నమాట.
ఎల్లమ్మ చిత్రంలో కీర్తిసురేశ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మొదట ఈ సినిమాలో లీడ్ రోల్ కోసం నానిని సంప్రదించగా అంతగా ఆసక్తి చూపలేదట. ఆ తర్వాత నితిన్ ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చినా పలు కారణాల వల్ల పక్కకు తప్పుకున్నాడు. శర్వానంద్, బెల్లం కొండ శ్రీనివాస్ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత ఫైనల్‌గా ఎల్లమ్మ ప్రాజెక్ట్ దేవీ శ్రీ ప్రసాద్ చేతిలో పడింది.
నటీనటుల ఎంపిక కారణంగా ఇప్పటికే మొదలు కావాల్సిన ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతూ వస్తోంది. ఈ మూవీ తెలంగాణ బ్యాక్ డ్రాప్లో సాగనుంది. మరిన్ని వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
Shreyas Talpade | భారీ పెట్టుబడి మోసం కేసు .. చిక్కుల్లో బాలీవుడ్ నటులు శ్రేయస్ తల్పడే, అలోక్ నాథ్
The Girlfriend Trailer | రష్మిక మందన్నా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ట్రైలర్ విడుదల
Srinu Vaitla | శ్రీను వైట్లకి హీరో దొరికాడా..ఈ సారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడుగా..!