ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ అనగానే అందరికి జనతా గ్యారేజ్ గుర్తొస్తుంది. అయితే ఈ చిత్రం తరువాత ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుకున్నా అది కుదరలేదు. ఎట్టకేలకు ఈ సూపర్‌హిట్ కలయిక దేవరతో కుదిరింది. ఎన్టీఆర్, కొరటాల శివ కలయికలో రాబోతున్న దేవర ఈ నెల 27న విడుదల కానుంది. అయితే ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి, అంచనాలు ఎక్కువగానే వున్నాయి.
ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటించిన సినిమా మూడేళ్ల గ్యాప్‌తో రావడం ఒక రీజన్ అయితే, అపజయం ఎరుగని కొరటాల ఆచార్య ఫ్లాప్ తరువాత కసిగా తీసిన సినిమా కావడం మరో కారణం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ దేవ, వర అనే రెండు విభిన్నమైన పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. రస్టిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ ఎంతో కష్టపడ్డాడని శివ తన ఇంటర్వ్యూలొ చెప్పకొచ్చారు.
అయితే ఈ చిత్ర కథను ఎన్టీఆర్‌కు కథగా నెరేషన్ ఇచ్చినప్పుడే దాదాపు నాలుగు గంటలు పట్టిందని, ఇక ఈ కథ పేపర్ పైకి వచ్చే సరికి మరింత పరిధి పెరిగిందని అన్నారు శివ. దేవర చిత్రీకరణలో సెకండ్ షెడ్యూల్లోనే ఈ చిత్రానికి రెండో పార్ట్ తీద్డామని అనుకున్నామని, ఈ కథను మూడు గంటల్లో చెప్పడం అవ్వదని అప్పుడే తెలిసిపోయిందని చెప్పారు. సన్సేషన్ కోసమో, మార్కెటింగ్ కోసమే రెండో పార్ట్ అనౌన్స్ చేయలేదని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.
అయితే ఈ చిత్రం రెండో పార్ట్ గురించి ఎదురుచూడాలంటే మొదటి పార్ట్ పతాక సన్నివేశాల్లో క్లిఫ్ హ్యాంగర్ (బలమైన సస్పెన్స్ అంశం) ఖచ్చితంగా వుండాలి. అయితే ఈ విషయం గురించి ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లిఫ్ హ్యాంగర్ గురించి తనకు తెలియదని చెప్పగా, కొరటాల మాత్రం ఈ సినిమాలో ఈ సినిమా ఇంటర్వెల్, క్లైమాక్స్ చాలా అద్భుతంగా కుదిరాయి. దేవర ఫస్ట్ పార్ట్ ఎండింగ్లో క్లిఫ్ హ్యాంగర్ (బలమైన సస్పెన్స్) ఉంటుంది. సెకండ్ పార్ట్‌కి లీడ్, సెకండ్ పార్ట్‌లో ఏముంటుందో అనే సస్పెన్స్ అయితే జనరేట్ అవుతుంది’ అని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఈ విషయం ఇంకా రెండు రోజుల్లో తెలిసిపోతుంది.
Read More :
Devara Movie | ‘దేవర’ టికెట్ ధరలు.. నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ షాక్.!
Devara Movie | ‘దేవర’ రిలీజ్.. ఎన్టీఆర్ అభిమానులను నిర్మాత నాగవంశీ రిక్వెస్ట్