Devara Movie | ‘దేవర’ రిలీజ్.. ఎన్టీఆర్ అభిమానులను నిర్మాత నాగవంశీ రిక్వెస్ట్
Devara Movie | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం దేవర. నందమూరి అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తుండగా.. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Devara Movie | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం దేవర. నందమూరి అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తుండగా.. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్ సోలోగా వస్తుండటంతో ఈ మూవీపై ఇటు టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా వైడ్‌గా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మూవీ నుంచి రెండు ట్రైలర్లను విడుదల చేయగా.. రికార్డు వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతున్నాయి. అయితే ఈ సినిమా విడుదల సందర్భంగా సితార ఎంటర్టైనమెంట్స్ అధినేత నాగవంశీ తారక్ అభిమానులకు ఒక రిక్వెస్ట్ పెట్టాడు. ఈ సినిమాతో అయిన ఫ్యాన్ వార్‌కు ముగింపు పలకాలని కోరాడు.
తారక్ అన్న చాలా గ్యాప్ తర్వాత మంచి ఎమోషనల్ మాస్ కంటెంట్‌తో వస్తున్నారు. ప్రేక్షకులకు మంచి కంటెంట్‌ని అందించడం కోసం తన వంతు కృషి చేశాడు. ప్రభుత్వ సాయంతో చాలా రోజుల తరువాత ఏపీలో బెనిఫిట్ షోలు, ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో దీనిని విడుదల చేసేలా మేము మా బాధ్యత పూర్తి చేశాం. మా విజ్ఞప్తి ఎంటి అంటే.. మీరు కూడా బాధ్యతతో.. ప్రశాంతంగా ఉండండి. ఈ అనవసరమైన ఫ్యాన్ వార్లను సృష్టించడం ఆపండి. ఇలాంటి ఫ్యాన్ వార్ల వలన మన సినిమాపై మనమే నెగటివిటి చేస్తున్నట్లు ఉంటుంది. దయచేసి అభిమానులంతా ఫ్యాన్ వార్స్‌కు స్వస్తి పలకాలని.. సినిమాని ఎంజాయ్ చేయాలని కోరుతున్నా. అలాగే సినిమా చూసే అభిమానులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. మీ పక్కన కూర్చున్న వారిని కూడా వీడియోలు తీయనివ్వకండి. ఇలా చేయడం వలన తర్వాత వచ్చే వారికి కూడా సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. దేవర సినిమాతో తారక్ అన్నకు ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్‌బస్టర్ అందిద్దాం. ‘దేవర సెప్పిండు అంటే సేసినట్టే’ అంటూ నాగవంశీ రాసుకోచ్చాడు.
#Devara #AllHailTheTiger 🔥🔥🔥🤩🤩🤩
Tarak anna chala gap tarvatha manchi emotional mass content tho vasthunnaru. He did his part by giving us very good content.
From our side, we did everything we can to give u a wide release, as per the availability and possibility, along… pic.twitter.com/NsRV1oZgpz
— Naga Vamsi (@vamsi84) September 25, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

