Devara Movie | మరో వారం రోజుల్లో ‘దేవర’ సందడి షురూ కానున్న విషయం తెలిసిందే. ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్ సోలోగా వస్తుండటంతో ఈ మూవీపై ఇటు టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా వైడ్‌గా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేయగా.. రికార్డు వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.
ఇదిలావుంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 22న మేకర్స్ భారీ ఎత్తున్న ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేశ్ బాబు ముఖ్య అతిథిగా పిలవనున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలకు చెక్ పెడుతూ.. మరో వార్త వైరల్ అవుతుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఇండియన్ టాప్ దర్శకులు రాజమౌళితో పాటు త్రివిక్రమ్, సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్‌కు పండగా అని చెప్పుకోవచ్చు. కాగా దీనిపై దేవర టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Exclusive – #Devara – SSR, Trivikram & Neel pic.twitter.com/2IFe38suUx
— Aakashavaani (@TheAakashavaani) September 19, 2024
Also Read..