Devara | పాటలు, ప్రచార చిత్రాల ద్వారా ఇప్పటికే ‘దేవర -1’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. దీనికి తగ్గట్టు ఈ సినిమా మరో ఘనత సాధించింది. ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా ‘దేవర -1’ విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న సాయంత్రం ఆరున్నర గంటలకు, ఘనమైన సినిమా చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక సినిమా వేదిక ‘బియాండ్ ఫెస్ట్’లో ‘దేవర -1’ రెడ్ కార్పెట్ ఈవెంట్ జరుపనున్నారు. హాలీవుడ్, లాస్ ఏంజిల్స్‌లోని ఐకానిక్ ఈజిప్షియన్ థియేటర్లో ఈవెంట్ జరుగనుంది. ఇక్కడ ప్రీమియర్ కానున్న తొలి భారతీయ సినిమాగా ‘దేవర -1’ రికార్డు సృష్టించింది.
ఈ ప్రీమియర్‌కి ప్రముఖ హాలీవుడ్ నటీనటులతో పాటు హై ప్రొఫైల్ ఉన్న అమెరికన్ సిటిజన్స్ కూడా హాజరు కానున్నారు. ఈ వేడుక ప్రపంచ వేదికపై ‘దేవర-1’ ఖ్యాతిని మరింత పెంచనున్నదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ పాన్ఇండియా చిత్రంలో జాన్వీకపూర్ కథానాయిక. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, అజయ్, గెటప్ శ్రీను తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు: మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె, సమర్పణ: నందమూరి కల్యాణ్‌రామ్.