మహేష్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకుడు. సోమినేని బాలకృష్ణ నిర్మాత. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని ‘నమో ఈశ్వర’ అనే పాటను సోమవారం విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరచిన ఈ గీతాన్ని శ్రీనివాసమౌళి రచించారు. శివున్ని స్తుతిస్తూ చక్కటి అధ్యాత్మిక భావాలతో ఈ పాట సాగింది. హీరో అశోక్ గల్లా ఇంటెన్స్ లుక్‌లో కనిపించారు. విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. డివైన్ ఎలిమెంట్స్‌తో కూడిన యాక్షన్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ఇదని, భావోద్వేగాలు హృదయాన్ని కదిలిస్తాయని చిత్ర బృందం పేర్కొంది. వారణాసి మానస కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమరా: ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, కథ: ప్రశాంత్‌వర్మ, దర్శకత్వం: అర్జున్ జంధ్యాల.