అభినవశౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దేవగుడి’. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించారు. డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకురానుంది. శుక్రవారం చిత్ర టీజర్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. నిజజీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించామని, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు సినిమాకు పనిచేశారని దర్శకనిర్మాత తెలిపారు.
టైటిల్ చాలా బాగుందని, ఈ కథ విన్నప్పుడు ఆసక్తికరంగా అనిపించిందని హీరో శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.కె.మదీన్ అండ్ రఘు కుంచె, రచన-దర్శకత్వం:
నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి.