ముంబై : బ్రహ్మాస్త్ర మూవీతో భారీ విజయాన్ని అందుకున్న బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ ఆస్తుల విలువపై ఓ రిపోర్ట్ వెల్లడైంది. బాలీవుడ్లో అత్యదిక పారితోషికం అందుకునే నటుల్లో ఒకరైన రణ్‌బీర్ కపూర్ ఆస్తుల విలువ ఏకంగా రూ 337 కోట్లుగా చెబుతున్నారు.
రణ్‌బీర్‌కపూర్‌కు బారీ మొత్తంలో రెమ్యూనరేషన్ చెల్లించేందుకు బడా నిర్మాతలు సిద్ధంగా ఉండగా పలు బ్రాండ్స్‌ను ఎండార్స్ చేస్తూ బ్రహ్మాస్త్ర స్టార్ రెండు చేతులా ఆర్జిస్తున్నాడు. ఒప్పో, టాటా ఏఐజీ, ఓరియో వంటి బ్రాండ్లను రణ్‌బీర్ ప్రమోట్ చేస్తున్నాడు. రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం ఉంటున్న ముంబై ఫ్లాట్ విలువ రూ 30 కోట్ల పైమాటేనని చెబుతున్నారు.
పాలి హిల్‌లో ఉన్న ఈ ప్రాపర్టీని స్వయంగా గౌరీ ఖాన్ డిజైన్ చేశారు. ఇక రణ్‌బీర్ కపూర్ తరచూ రూ 1.6 కోట్ల ఖరీదైన ఎస్‌యూవీలో కనిపిస్తుండగా, ఆయన గ్యారేజ్‌లో బీఎండబ్య్లూ 6 నుంచి మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ వరకూ పలు లగ్జరీ కార్లున్నాయి.