హరివర్మన్ హీరోగా నటిస్తున్న ‘దేశం కోసం మనలో ఒక్కడు’ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గోపీవర్మ దర్శకుడు. గోపీవర్మ ఫిల్మ్స్ పతాకంపై రాజశేఖర్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నటుడు సత్యప్రకాష్ క్లాప్‌నివ్వగా, కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ కెమెరా స్విఛాన్ చేశారు.
దర్శకుడిగా తనకిది రెండో చిత్రమని, సందేశాత్మక కథాంశంతో రూపొందిస్తున్నామని గోపీవర్మ తెలిపారు. త్వరలో రెండో షెడ్యూల్ మొదలుపెడతామని నిర్మాత రాజశేఖర్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకీ కనకాల, సంగీతం: హర్ష ప్రవీణ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీవర్మ.