ఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టు చీఫ్ కోచ్ హరేందర్ సింగ్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో కోచ్ పదవికి రాజీనామా చేసినట్టు ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపాడు. నిరుడు ఏప్రిల్‌లో కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన మార్గదర్శకత్వంలో భారత జట్టు గతేడాది నవంబర్‌లో ఆసియా చాంపియన్స్‌గా నిలిచింది.
కానీ 2024-25 సీజన్లో ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో మాత్రం భారత జట్టు ఆఖరి స్థానంతో ముగించడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి.