శాంటిగొ (చిలీ): ఎఫ్ఐహెచ్ మహిళల జూనియర్ ప్రపంచకప్‌లో భారత జట్టు భారీ విజయంతో టోర్నీలో శుభారంభం చేసింది. పూల్ సీలో ఉన్న భారత్.. 13-0తో నమీబియాను చిత్తుగా ఓడించి ఘనంగా బోణీ కొట్టింది. మ్యాచ్ ఆసాంతం గోల్స్ వర్షం కురిపించిన భారత ఆటగాళ్లు.. పూర్తిస్థాయిలో ఆధితప్యం ప్రదర్శించారు.
మొదటి క్వార్టర్ పదో నిమిషంలో సాక్షి రాణా గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. కనిక, హినా హ్యాట్రిక్ గోల్స్‌తో రాణించగా సాక్షి రెండు గోల్స్ చేసింది. సోనమ్, ఇషికా, మనీషా చెరో గోల్ కొట్టారు. ఈ టోర్నీలో భారత్ డిసెంబర్ 3న ఐర్లాండ్‌తో తలపడనుంది.