Paresh Rawal | తాజ్‌మహల్ వివాదం.. పరేష్ రావల్ సినిమాపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్!
The Taj Story | బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వివాదాస్పద చిత్రం 'ది తాజ్ స్టోరీ' (The Taj Story). ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
The Taj Story | బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వివాదాస్పద చిత్రం ‘ది తాజ్ స్టోరీ’ (The Taj Story). ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా విడుదలని అడ్డుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. ఈ చిత్రం చారిత్రక వాస్తవాలను వక్రీకరించడమే కాకుండా, మత సామరస్యాన్ని దెబ్బతీస్తుందని పిటిషనర్ ఆరోపించారు.
అడ్వకేట్ షకీల్ అబ్బాస్ ఈ పిటిషన్‌ను దాఖలు చేయగా.. ఇందులో ఆయన సెన్సార్ బోర్డు (CBFC), కేంద్ర ప్రభుత్వం, చిత్ర నిర్మాత, దర్శకుడు, నటుడు పరేష్ రావల్‌ను ప్రతివాదులుగా చేర్చారు. ఈ చిత్రం తాజ్ మహల్ చారిత్రక వాస్తవాలను వక్రీకరించడమే కాకుండా, మత సామరస్యాన్ని దెబ్బతీస్తుందని తెలిపాడు. అలాగే ఒక ప్రత్యేక రాజకీయ సిద్ధాంతాన్ని ఈ చిత్రం ప్రోత్సహిస్తోందని పిటిషనర్ ఆరోపించారు. ఈ సినిమా విడుదలైతే మత విద్వేషాలకు దారితీసే అవకాశం ఉందని ఇది దేశ లౌకిక స్ఫూర్తిని దెబ్బతీస్తుందని అబ్బాస్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు స్పందిస్తూ.. ఈ పిటిషన్‌ను తక్షణమే విచారించడానికి నిరాకరించింది. ఈ అంశాన్ని సాధారణ విచారణలో భాగంగా పరిశీలిస్తామని కోర్టు స్పష్టం చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

