Deepika Padukone | ‘ధురంధర్ 2’ మూవీపై దీపికా మౌనం .. మనస్పర్థలు వచ్చాయంటూ జరిగిన ప్రచారాలకి చెక్
Deepika Padukone | బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ విజయాన్ని నమోదు చేస్తోంది. ఫస్ట్ పార్ట్‌ని మించిపోయేలా ఈ సీక్వెల్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు, స్పై ఎలిమెంట్స్, ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది.
Deepika Padukone | బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ విజయాన్ని నమోదు చేస్తోంది. ఫస్ట్ పార్ట్‌ని మించిపోయేలా ఈ సీక్వెల్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు, స్పై ఎలిమెంట్స్, ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది.దేశవ్యాప్తంగా థియేటర్ల వద్ద ‘హౌస్‌ఫుల్’ బోర్డులు కనిపిస్తుండగా, రణవీర్ కెరీర్లోనే ఇది అతిపెద్ద హిట్‌గా నిలుస్తోంది. ఈ విజయంపై టాలీవుడ్ స్టార్లు అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా చిత్ర బృందాన్ని అభినందించారు.
అయితే ఈ భారీ విజయోత్సాహం మధ్య ఒక ఆసక్తికర అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. రణవీర్ భార్య, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఈ సినిమా విజయంపై వెంటనే స్పందించకపోవడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా భర్త విజయాలపై వెంటనే రియాక్ట్ అయ్యే దీపికా ఈసారి మౌనం పాటించడంతో, వారిద్దరి మధ్య ఏమైనా మనస్పర్థలు ఉన్నాయా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ముంబైలో జరిగిన స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరు కాకపోవడం, ఆ తర్వాత కుటుంబంతో ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం ఈ రూమర్లకు మరింత బలం చేకూర్చింది. అయితే ఈ పుకార్లకు త్వరగానే చెక్ పడింది. ఆదివారం ముంబైలోని ఓ ప్రముఖ రెస్టారెంట్ వద్ద రణవీర్–దీపికా జంట కలిసి కనిపించారు. ఈ పవర్ కపుల్‌ను చూసేందుకు అభిమానులు భారీగా చేరుకోగా, రణవీర్‌కు ‘బబ్బర్ షేర్’ అంటూ నినాదాలు వినిపించాయి.
ఈ సందర్భంలో దీపికా ముఖంలో కనిపించిన ఆనందం, గర్వం..తన భర్త విజయంపై ఆమె ఎంత సంతోషంగా ఉన్నారో స్పష్టంగా తెలియజేశాయి. సోషల్ మీడియాలో పోస్టులు చేయకపోయినా, ప్రత్యక్షంగా కలిసి కనిపించడం ద్వారా అన్ని రూమర్లకు ఫుల్ స్టాప్ పడింది. ‘ధురంధర్ 2’ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ జంట బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

